ప్రశాంతంగా సీఎం బాధ్యతలను నిర్వర్తించకుండా రోశయ్యను హింసించారు: వీహెచ్

04-12-2021 Sat 13:23
  • ప్రశాంతంగా పని చేసుకోనివ్వలేదనే బాధ రోశయ్యలో ఉండేది
  • అందరూ రోశయ్యను ఉపయోగించుకున్నారు
  • రోశయ్య మృతి కాంగ్రెస్ కు తీరని లోటు
VH sensational comments about Rosaiah
ఉమ్మడి ఏపీ మాజీ మఖ్యమంత్రి రోశయ్య మృతి అందరినీ కలచి వేస్తోంది. రాజకీయ ప్రముఖులందరూ ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. రోశయ్య సేవలను, ఆయనతో వారికున్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ, రోశయ్య మృతి ఎంతో బాధను కలిస్తోందని అన్నారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెప్పారు. రోశయ్య మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
 
ముఖ్యమంత్రిగా రోశయ్యను ప్రశాంతంగా పని చేసుకోనివ్వకుండా హింసించారని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ప్రశాంతంగా పని చేసుకోనివ్వలేదనే బాధ రోశయ్యలో ఉండేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోశయ్యను ఉపయోగించుకున్నారని అన్నారు.