విశాఖలో అఖండ సినిమాకు తరలివచ్చిన అఘోరాలు

04-12-2021 Sat 12:12
  • నర్సీపట్నం బంగార్రాజు థియేటర్ లో సందడి
  • అఘోరాలూ ఫ్యాన్స్ అయ్యారంటూ అభిమానుల కేకలు
  • కాసేపు వారితో మాట్లాడిన అఘోరాలు
Aghoras Watched Balayya Babu Akhanda Movie In Narsipatnam
బాలయ్య బాబు అఖండ సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. బాలయ్య ఉగ్రరూపం చూసి అభిమానులు థియేటర్లలో సందడి చేస్తున్నారు. అభిమానులే కాదు.. ఇవాళ కొందరు అఘోరాలూ సినిమా చూసేందుకు వచ్చారు.

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్ లో సందడి చేశారు. అఘోరాలూ బాలయ్య ఫ్యాన్స్ అయ్యారంటూ అభిమానులు కేకలేశారు. సినిమా అనంతరం బాలయ్య అభిమానులతో అఘోరాలు కాసేపు ముచ్చటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.