'లైగర్' లో బాలయ్య గెస్టు రోల్?

04-12-2021 Sat 12:02
  • ముగింపు దశలో 'లైగర్'
  • బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ
  • అతిథి పాత్రలో మైక్ టైసన్
  • వచ్చే ఏడాదిలో విడుదల  
Liger movie updare
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇటీవలే లాస్ వెగాస్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చింది. మరో షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తి చేసుకుంటుందని అంటున్నారు.

ఈ షెడ్యూల్లో బాలకృష్ణ పాల్గొననున్నారనే టాక్ ఇప్పుడు జోరుగా షికారు చేస్తోంది. 'లైగర్' బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ. అందువలన మైక్ టైసన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఇక బాలకృష్ణ కూడా కాసేపు తెరపై మెరిసేలా పూరి ఒక ప్లాన్ చేశాడని చెప్పుకుంటున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోయాయట.

ఈ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో మెరిస్తే, మాస్ ఆడియన్స్ నుంచి మంచి మైలేజ్ వస్తుంది. అందువలన పూరి రిక్వెస్ట్ చేయడం .. బాలకృష్ణ అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు. 'పైసా వసూల్' సినిమా నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. 'లైగర్' వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.