ఈ బ్రేకప్ ఎంతో బాధిస్తోంది: యువ‌న‌టి స‌న్యా భావోద్వేగ‌భ‌రిత వ్యాఖ్య‌లు

04-12-2021 Sat 11:42
  • దంగ‌ల్‌లో ఆమిర్ ఖాన్ రెండో కూతురిగా న‌టించిన  స‌న్యా
  • ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించాన‌న్న న‌టి
  • అత‌డితో నాలుగేళ్లు రిలేష‌న్ కొన‌సాగించాక బ్రేకప్
  • తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని వివ‌ర‌ణ
Sanya Malhotra on her break up
బాలీవుడ్ సినిమా దంగ‌ల్‌లో ఆమిర్ ఖాన్ రెండో కూతురిగా న‌టించిన స‌న్యా మ‌ల్హోత్రా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో భావోద్వేగ‌భ‌రిత వ్యాఖ్య‌లు చేసింది. తాను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించాన‌ని తెలిపింది. అయితే, అత‌డితో నాలుగేళ్లు రిలేష‌న్ కొన‌సాగించాక బ్రేకప్ అయ్యిందని వివ‌రించింది. దీంతో తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, ఈ బ్రేకప్ ఎంతో బాధిస్తోంద‌ని చెప్పింది.

బ్రేక‌ప్ కావ‌డం కంటే అధికంగా బాధ‌ప‌డే విష‌యం మ‌రొక‌టి ఉండ‌బోద‌ని తెలిపింది. అయితే, మ‌న‌ల్ని కాద‌నుకున్న వారి గురించి మ‌నం ఆలోచించ‌కూడ‌ద‌ని హిత‌వు ప‌లికింది. తాను ప్ర‌స్తుతం త‌న‌ ఆరోగ్యం, సినిమాల‌పై దృష్టి సారించాన‌ని వివ‌రించింది. కాగా, స‌న్యా న‌టించిన‌ మీనాక్షి సుందరేశ్వర్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. దానికి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన వ‌స్తోంది.