క్రీజులో పాతుకుపోయి 150 ప‌రుగుల దిశగా దూసుకుపోతోన్న‌ మ‌యాంక్ అగ‌ర్వాల్

04-12-2021 Sat 11:21
  • భార‌త్-న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్ల  మ‌ధ్య‌ రెండో టెస్టు
  • అద్భుతంగా రాణిస్తోన్న‌ టీమిండియా ఓపెన‌ర్ మ‌యాంక్
  • క్రీజులో మ‌యాంక్ 143, అక్ష‌ర్ ప‌టేల్ 24
  • టీమిండియా స్కోరు 93 ఓవ‌ర్ల వ‌ద్ద‌ 270-6
team india score
భార‌త్-న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్ లో రెండో రోజు ఆట కొన‌సాగుతోంది. టీమిండియా ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ క్రీజులో పాతుకు పోయి నాలుగు సిక్సులు, 16 ఫోర్ల సాయంతో 143 ప‌రుగులు చేశాడు. తోటి బ్యాట్స్‌మెన్ అంద‌రూ రాణించ‌లేక‌పోతోన్న వేళ మ‌యాంక్ అగ‌ర్వాల్ మాత్రం క్రీజులో పాతుకుపోయి 150 ప‌రుగుల దిశగా దూసుకుపోతున్నాడు.

శుభ‌మ‌న్ గిల్ 44, చ‌టేశ్వ‌ర్ పూజారా 0, విరాట్ కోహ్లీ 0, శ్రేయాస్ అయ్య‌ర్ 18, వృద్ధిమాన్ సాహా 27, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 0 ప‌రుగులు చేశారు. ప్ర‌స్తుతం క్రీజులో మ‌యాంక్ అగ‌ర్వాల్ 143, అక్ష‌ర్ ప‌టేల్ 24 ప‌రుగుల‌తో ఉన్నారు. టీమిండియా స్కోరు 93 ఓవ‌ర్ల వ‌ద్ద‌ 270-6గా ఉంది.