రాజకీయాల్లో ఒక శకం ముగిసింది: చిరంజీవి

04-12-2021 Sat 11:14
  • రోశయ్య గారి మరణం తీరని విషాదం
  • ప్రజా జీవితంలో ఆయన ఒక మహోన్నత నేత
  • రాజకీయ విలువలను కాపాడటంలో ఒక ఋషిలా పని చేశారు
One political era ended with Rosaiahs death says Chiranjeevi
మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపై సినీ నటుడు చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొణిజేటి రోశయ్య గారి మృతి తీరని విషాదమని ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాలలో రోశయ్య భీష్మాచార్యుడి వంటివారని అన్నారు. ప్రజా జీవితంలో రోశయ్య గారు ఒక మహోన్నత నేత అని కొనియాడారు. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలను కాపాడటంలో ఆయన ఒక ఋషిలా సేవ చేశారని చెప్పారు.

వివాదరహితులుగా, నిష్కళంకితులుగా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య గారని అన్నారు. ఆయన కన్నుమూయడంతో రాజకీయాలలో ఒక శకం ముగిసిందని చెప్పారు. రోశయ్య గారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.