దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

04-12-2021 Sat 11:04
  • కొత్త‌గా 8,603 క‌రోనా కేసులు
  • నిన్న‌ 415 మంది మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య‌ 99,974
  • కోలుకున్న వారి సంఖ్య‌ మొత్తం 3,40,53,856
corona bulletin in inida
దేశంలో కొత్త క‌రోనా కేసుల సంఖ్య 9,000 కంటే త‌క్కువ‌గా న‌మోదైంది. దేశంలో కొత్త‌గా 8,603 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న‌ 415 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న క‌రోనా నుంచి 8,190 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య‌ 99,974గా ఉంది.

కోలుకున్న వారి సంఖ్య‌ మొత్తం 3,40,53,856గా ఉంది. మృతుల సంఖ్య మొత్తం 4,70,530కి పెరిగింది. నిన్న దేశంలో 73,63,706 వ్యాక్సిన్ డోసులు వేశారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1,26,53,44,975 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించారు.