Katrina Kaif: ఈ నెల 9న కత్రినా, విక్కీ పెళ్ళి.. అతిథులకు పలు నిబంధనలు విధించిన జంట!

Strict rules for Katrina Kaif and Vicky Kaushal marriage
  • రాజస్థాన్ లోని ఓ రాజభవనంలో జరగనున్న పెళ్లి
  • పెద్ద ఎత్తున హాజరుకానున్న సెలబ్రిటీలు
  • ఫొటోలు, వీడియోలు తీయకుండా ఆంక్షలు
బాలీవుడ్ ప్రేమపక్షులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న రాజస్థాన్ లోని ఓ రాజభవనంలో వీరి పెళ్లి జరగబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ మీడియా మొత్తం వీరి పెళ్లికి సంబంధించిన వార్తలనే హైలైట్ చేస్తోంది. వీరి వివాహానికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు హాజరుకానున్నారు. దీంతో అతిథులకు పలు నిబంధనలను విధిస్తున్నట్టు సమాచారం.

ఫోన్లు, ఫొటోలు, లొకేషన్ షేరింగ్ వంటి వాటికి అనుమతి లేదు. వివాహానికి ఎవరెవరు వచ్చారనే సమాచారాన్ని బయటకు షేర్ చేయకూడదు. సోషల్ మీడియాలో చిత్రాలు, వీడియోలను పంచుకోకూడదు. పెళ్లికి వచ్చిన అతిథులు మళ్లీ బయటకు వెళ్లేంత వరకు వారికి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. వివాహ వేదిక వద్ద ఫొటోలు, వీడియోలు తీయకూడదు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఫొటోగ్రాఫర్లు కత్రిన, విక్కీ ఫొటోలను తీయకుండా ఉండేందుకు.. ఈ జంటను హెలికాప్టర్ ద్వారా వేదిక వద్దకు తీసుకుపోనున్నట్టు సమాచారం. వెడ్డింగ్ ఫొటోగ్రఫీ హక్కులను ఓ అంతర్జాతీయ మేగజీన్ కు విక్రయించినట్టు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే అతిథులను కొంత మందిని తగ్గించాలని వీరు భావిస్తున్నారు.
Katrina Kaif
Vicky Kaushal
Bollywood
Marriage

More Telugu News