ప్రభాస్ 'రాధేశ్యామ్' కోసం డబ్బింగ్ పనులు పూర్తిచేసిన పూజ హెగ్డే

03-12-2021 Fri 20:40
  • ప్రభాస్ హీరోగా 'రాధేశ్యామ్'
  • 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చిత్రం
  • ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే
  • సంక్రాంతి సీజన్ లో విడుదలవుతున్న 'రాధేశ్యామ్'
Pooja Hegde completes her dubbing for Prabhas RadheShyam
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. పీరియాడికల్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయిక. తాజాగా 'రాధేశ్యామ్' లో తన పాత్రకు డబ్బింగ్ మొత్తం పూర్తిచేసింది. ఈ చిత్రంలో పూజ హెగ్డే పాత్ర పేరు 'ప్రేరణ'.

'ప్రేరణ' డబ్బింగ్ చెప్పేసిందంటూ 'రాధేశ్యామ్' చిత్రబృందం ట్విట్టర్ లో వెల్లడించింది. రిలీజ్ దిశగా మరో అడుగు ముందుకేశామని వివరించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.