Nitin Gadkari: హైడ్రోజన్ తో నడిచే కారును కొనుగోలు చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

  • కాలుష్య నివారణకు యత్నం
  • ప్రత్యామ్నాయ ఇంధనాలపై అవగాహన కోసం కృషి
  • తన కారుతో ఢిల్లీ రోడ్లపై ప్రయాణిస్తానని గడ్కరీ వెల్లడి
  • వ్యర్థాల నుంచి హైడ్రోజన్ తయారుచేయొచ్చని వివరణ
Union minister Nitin Gadkari bought Hydrogen Car

మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. కాలుష్య రహిత ఇంధనాలు ఉపయోగించడంపై ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధనాలకు ప్రత్యాయ్నాలను ఉపయోగించాలనే వారిలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒకరు. రహదారి కాలుష్య నివారణకు ఆయన కొంతకాలంగా గట్టిపోరాటమే చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన ఓ హైబ్రిడ్ కారును కొనుగోలు చేశారు. దీనికి ఇంధనంగా పెట్రోల్, డీజిల్, సహజవాయువు ఇవేవీ ఉపయోగించరు. ఈ కొత్త కారు హైడ్రోజన్ తో నడుస్తుంది. ఓ సదస్సులో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు.

తన హైడ్రోజన్ కారుతో త్వరలోనే ఢిల్లీ రోడ్లపై ప్రయాణిస్తానని, తద్వారా ప్రజల్లో ఈ తరహా ప్రత్యామ్నాయ ఇంధనాలపై అవగాహన కల్పిస్తానని తెలిపారు. పైగా, మురుగు నీరు, ఘనరూప వ్యర్థాల నుంచి హైడ్రోజన్ ను తయారుచేసి దాన్నే ఇంధనంగా ఉపయోగించే వీలుందని వివరించారు. వివిధ నగరాల్లో హైడ్రోజన్ తో బస్సులు, ట్రక్కులు, కార్లను పరుగులు తీయించాలనేది తన ప్రణాళిక అని గడ్కరీ తెలిపారు. వ్యర్థాలను కూడా సద్వినియోగ పరిచేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు.

More Telugu News