'పుష్ప' నుంచి ట్రైలర్ టీజ్!

03-12-2021 Fri 19:13
  • అల్లు అర్జున్ నుంచి 'పుష్ప'
  • అడవి నేపథ్యంలో సాగే కథ
  • ఈ నెల 6వ తేదీన ట్రైలర్ రిలీజ్
  • 17వ తేదీన సినిమా విడుదల
Pushpa Trailer Tease Released
అల్లు అర్జున్ కథానాయకుడిగా 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగాన్ని డిసెంబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ సినిమా నుంచి ఈ నెల 6వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం చెప్పారు. మళ్లీ ఆ విషయాన్ని గుర్తుచేస్తూ, ట్రైలర్ టీజ్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ టీజ్ ఆకట్టుకుంటోంది. పూర్తి ట్రైలర్ ను 6వ తేదీన వదలనున్నారు.

రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. కీలకమైన పాత్రలో జగపతిబాబు, ముఖ్యమైన పాత్రల్లో సునీల్ .. అనసూయ  కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది.