'వాల్తేర్ వీర్రాజు'ను మొదలెట్టేసిన చిరూ!

03-12-2021 Fri 18:04
  • బాబీ దర్శకుడిగా 'వాల్తేర్ వీర్రాజు'
  • క్రితం నెలలో జరిగిన పూజా కార్యక్రమాలు
  • నిన్ననే మొదలైన షెడ్యూల్ 
  • నెలాఖరు వరకూ షూటింగ్  
Valther Veerraju movie update
చిరంజీవి - బాబీ కాంబినేషన్లో 'వాల్తేర్ వీర్రాజు' సినిమా రూపొందుతోంది. క్రితం నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. నిన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైపోయింది.

బాబీకి చిరంజీవి నెల రోజుల పాటు వరుసగా డేట్లు ఇచ్చారట. అందువలన ఈ నెల చివరివరకూ చిరంజీవి కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తారని అంటున్నారు. ఆ తరువాత చిరంజీవి మళ్లీ 'గాడ్ ఫాదర్' సెట్స్ పైకి వెళ్లిపోతారని అంటున్నారు. అందువలన బాబీ పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

చిరంజీవి తాజా చిత్రంగా ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆచార్య' రెడీ అవుతోంది. ఆ తరువాత సినిమాలైన 'గాడ్ ఫాదర్' .. 'వాల్తేర్ వీర్రాజు' కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల కానున్నాయి. 'భోళా శంకర్' సినిమాను మాత్రం ఆ పై ఏడాదిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.