పీఆర్సీపై జగన్ చేసిన ప్రకటనపై ఉద్యోగులెవరికీ సమాచారం లేదు: బొప్పరాజు

03-12-2021 Fri 17:52
  • పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామన్న జగన్
  • పీఆర్సీ ఒక్కటే మా డిమాండ్ కాదన్న బొప్పరాజు
  • పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని వ్యాఖ్య
We dont have information on Jagan announcement on PRC says Bopparaju
ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఈరోజు కీలక ప్రకటన చేశారు. పది రోజుల్లోగా పీఆర్సీని ప్రకటిస్తామని ఆయన అన్నారు. అయితే ఈ పీఆర్సీ మాత్రమే తన డిమాండ్ కాదని... ఇతర అంశాలు కూడా ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటన చేసినట్టు తమ సంఘాల ఉద్యోగులెవరికీ సమాచారం లేదని అన్నారు.

పీఆర్సీ నివేదిక బహిర్గతం చేస్తేనే దానిపై చర్చించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. తమ డిమాండ్లకు అంగీకారం తెలిపితేనే ఉద్యమాన్ని విరమించుకుంటామని వెల్లడించారు. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ యథాతథంగా కొనసాగుతుందని చెప్పారు.