మోదీ, మన్మోహన్ కు మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది: సింధియా

03-12-2021 Fri 17:35
  • ఫలితాలు వచ్చేలా డైనమిక్ గా పని చేయడం మోదీ స్టైల్
  • ఈ నాలుగు నెలల్లో నేను గమనించింది ఇదే
  • జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో సింధియా స్పందన
The difference between Modi and Manmohan is this says Scindia
ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లకు మధ్య ఆకాశానికి, భూమికి మధ్య ఉన్నంత తేడా ఉందని కేంద్ర మంత్రి మాధవరావు సింధియా అన్నారు. ఫలితాలు వచ్చేలా డైనమిక్ పని చేయడం మోదీ స్టైల్ అని చెప్పారు. మోదీ పని విధానంలో డైనమిజం ఉంటుందని అన్నారు. కేంద్ర కేబినెట్లో చేరిన నాలుగు నెలల్లో తాను పరిశీలించింది ఇదేనని చెప్పారు.

జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ, మన్మోహన్ కు మధ్య మీరు గమనించిన తేడా ఏమిటని అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ సమాధానం ఇచ్చారు.