ఏపీలో మరో 138 మందికి కరోనా పాజిటివ్

03-12-2021 Fri 16:32
  • ఏపీలో బాగా తగ్గిన కొత్త కేసులు
  • గత 24 గంటల్లో 31,065 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 25 కేసులు
  • కృష్ణా జిల్లాలో ఒకరి మృతి
  • ఇంకా 2,157 మందికి చికిత్స
AP Covid report
ఏపీలో గడచిన 24 గంటల్లో చాలా తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. 31,065 శాంపిళ్లు పరీక్షించగా 138 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 25, కృష్ణా జిల్లాలో 24, తూర్పు గోదావరి జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తకేసులేవీ వెల్లడి కాలేదు.

అదే సమయంలో 118 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,390 పాజిటివ్ కేసులు నమోదు కాగా...  20,56,788 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,157 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,445కి పెరిగింది.