కోహ్లీ అవుట్ పై వివాదం.... టీవీ అంపైర్ పై తీవ్ర విమర్శలు

03-12-2021 Fri 16:13
  • ముంబయిలో రెండో టెస్టు
  • టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • కోహ్లీ ఎల్బీడబ్ల్యూ
  • బంతి బ్యాట్ కు తగిలినట్టు రీప్లేలో వెల్లడి
Kohli lbw issue raises comments in social media against tv umpire
న్యూజిలాండ్ తో ముంబయిలో జరుగుతున్న టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యరీతిలో డకౌట్ అయ్యాడు. కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బంతి ప్యాడ్లకు తగిలిందని భావించిన అంపైర్ అవుట్ అంటూ వేలెత్తగా, కోహ్లీ రివ్యూ కోరాడు. అయితే రివ్యూలో బంతి బ్యాట్ కు తగిలినట్టుగా కనిపించింది. కానీ టీవీ అంపైర్ కూడా అవుటిచ్చాడు. దాంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.

దీనిపై సీబీఐ విచారణ అవసరం అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. థర్డ్ అంపైర్ ను కటకటాల వెనక్కి నెట్టాలంటూ డిమాండ్ చేశాడు. మరో నెటిజన్ థర్డ్ అంపైర్ ను కళ్లకు గంతలు కట్టుకున్న గాంధారితో పోల్చాడు. పార్థివ్ పటేల్ వంటి సీనియర్ ఆటగాడు కూడా ఇది అంపైర్ తప్పిదమేనని తేల్చి చెప్పాడు. మాజీ ఆటగాడు వసీం జాఫర్ స్పందిస్తూ, కనీస జ్ఞానం కొరవడిందని విమర్శించాడు.