ఇది మొత్తం సినీ పరిశ్రమ విజయం : బాలకృష్ణ

03-12-2021 Fri 15:17
  • ఘన విజయం సాధించిన 'అఖండ'
  • కొత్తదనాన్ని ఆదరించే మంచి గుణం తెలుగువాళ్లకు ఎప్పుడూ ఉంటుంది
  • తెరపై నా నటనను చూసి నేనే కాస్త ఆశ్చర్యపోయా
This is total industry victory says Balakrishna
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సినిమా ఘన విజయం సాధించింది. సినిమా విడుదలైన తొలిరోజు భారీ వసూళ్లను రాబట్టింది. భారీ వసూళ్లను సాధించే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ పై బాలకృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒకప్పుడు భక్తిని రామారావు బతికించారని, ఇప్పుడు భక్తిని 'అఖండ' బతికించిందని చెప్పారు. కొత్తదనాన్ని ఆదరించే మంచి గుణం మన తెలుగువాళ్లకు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.

'అఖండ' సాధించిన విజయం మొత్తం సినీ పరిశ్రమ విజయమని బాలయ్య చెప్పారు. తెరపై తన నటనను చూసి తానే కాస్త ఆశ్చర్యపోయానని అన్నారు. తాను కేవలం తన దర్శకుడి సూచనలను పాటిస్తానని... తనకు ప్రతి సినిమా సమానమేనని చెప్పారు. ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం అద్భుతమని అన్నారు.