Hyderabad: లవర్ మాట్లాడలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ప్రియుడు

Man tried to commit suicide as his lover not speaking to him
  • ఒక యువతిని ప్రేమించిన నరేశ్ అనే యువకుడు
  • కొంత కాలంగా ఇద్దరి మధ్య మాటలు లేని వైనం
  • బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన నరేశ్
తాను మనస్పూర్తిగా ప్రేమించిన యువతి మాట్లాడటం లేదని తీవ్ర మనోవేదనకు గురైన యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లాకు చెందిన నరేశ్ అనే యువకుడు హైదరాబాదుకు చెందిన యువతిని ప్రేమించాడు. అయితే కొంత కాలంగా వీరి మధ్య దూరం పెరిగింది. ఇద్దరి మధ్య మాటలు లేవు.

ఈ నేపథ్యంలో తన ప్రియురాలు తనతో మాట్లాడటం లేదని నరేశ్ తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు.
Hyderabad
Lover
Suicide Attempt

More Telugu News