హిందీ రీమేక్ దిశగా 'శ్యామ్ సింగ రాయ్'

03-12-2021 Fri 10:27
  • 'శ్యామ్ సింగ రాయ్'గా నాని
  • కలకత్తా నేపథ్యంలో నడిచే కథ
  • దర్శకుడిగా రాహుల్ సాంకృత్యన్
  • ఈ నెల 24వ తేదీన విడుదల  
Shyam Singha Roy movie update
నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా రూపొందింది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో, సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా అలరించనున్నారు. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.

ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. అలాగే ప్రమోషన్స్ లో వేగం పెంచే దిశగా కూడా పనులు జరుగుతున్నాయి. కలకత్తా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఆచారాల పేరుతో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునే యువకుడి పాత్రలో నాని కనిపించనున్నాడు.

తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక హిందీలో ఈ  సినిమాను రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ కి చెందిన ఒక హీరో ఈ రీమేక్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నట్టుగా చెబుతున్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.