Balineni Srinivasa Reddy: మూడు రాజధానుల సవరణ బిల్లుపై మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు

  • గత అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును రద్దు చేసిన ప్రభుత్వం
  • సవరణలతో కొత్త బిల్లు ప్రవేశపెడతామన్న జగన్
  • వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు పెడతామని క్లారిటీ ఇచ్చిన బాలినేని
Balineni Srinivas Reddy comments on 3 capitals

మూడు రాజధానుల బిల్లును ఇటీవల జరిగిన సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లును కొన్ని సవరణలతో మళ్లీ ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం మళ్లీ టెన్షన్ ను పెంచింది. ఈ నేపథ్యంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల సవరణ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు.

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ చేసేవన్నీ డ్రామాలేనని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే ఎన్టీఆర్ కుటుంబసభ్యులు రావాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని త్వరలోనే గాడిలో పెడతామని అన్నారు. ఉద్యోగులందరికీ త్వరలోనే పీఆర్సీని అమలు చేస్తామని చెప్పారు.

More Telugu News