Akhanda: టాలీవుడ్ ప్రముఖుల నోట 'అఖండ' నామస్మరణ

Akhanda wave in Tollywood
  • నేడు అఖండ చిత్రం రిలీజ్
  • బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో చిత్రం
  • పాజిటివ్ గా రివ్యూలు
  • హర్షం వ్యక్తం చేసిన మహేశ్ బాబు, రామ్

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య నట విశ్వరూపం ప్రదర్శించాడంటూ రివ్యూలు చెబుతున్నాయి. అంతేకాదు, టాలీవుడ్ ప్రముఖులు సైతం అఖండ నామస్మరణ చేస్తున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు అఖండ చిత్రం ఓపెనింగ్స్ పై స్పందించారు. అఖండ చిత్రానికి అదిరిపోయే ఆరంభం లభించిందన్న వార్తలతో ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. నందమూరి బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీను గారికి, యావత్ చిత్రబృందానికి శుభాకాంక్షలు అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. మహేశ్ బాబు వ్యాఖ్యల పట్ల చిత్ర నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్ బదులిచ్చింది. థాంక్యూ మహేశ్ బాబు గారూ అంటూ స్పందించింది.

ఇక యువ హీరో రామ్ పోతినేని స్పందిస్తూ, ఎక్కడ చూసినా అఖండ గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నారని వెల్లడించారు. తెలుగు సినిమా వేవ్ మళ్లీ మొదలైందంటూ రామ్ హర్షం వ్యక్తం చేశారు. బాలకృష్ణ, బోయపాటి, చిత్రయూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపారు. అటు, అఖండ మాస్ జాతర అంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని వ్యాఖ్యానించారు. యావత్ చిత్ర పరిశ్రమ మొత్తం నేడు అఖండ విజయాన్ని ఆస్వాదిస్తోందని దర్శకురాలు నందినిరెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News