గద్వాల ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

CM KCR consoles Gadwal MLA family members
  • గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి పితృవియోగం
  • విషాదంలో ఎమ్మెల్యే కుటుంబం
  • నేడు గద్వాల వచ్చిన సీఎం కేసీఆర్
  • ఎమ్మెల్యే తండ్రి చిత్రపటానికి నివాళి
ఇటీవల గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వెంకట్రామిరెడ్డి మృతి చెందారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు గద్వాల వచ్చారు. బండ్ల వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు.

విషాదంలో ఉన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు ఉన్నారు.
Go Back to Shorts
CM KCR
Gadwal MLA
Krihna Mohan Reddy
TRS
Telangana

More Telugu News