Mudragada Padmanabham: కేసీఆర్‌, జ‌గ‌న్‌కు ముద్ర‌గ‌డ లేఖ‌లు

mudragada writes letters to cms
  • తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
  • రైతులను ఆదుకోవాలి
  • నీరు ఉండే పొలాల్లో వరి త‌ప్ప ఇత‌ర‌ పంటలు వేయ‌లేరు
తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు, ఏపీ సీఎం జ‌గ‌న్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖలు రాశారు. పాడ‌యిపోయిన‌ ధాన్యం నుంచి ఆర్ఎస్ స్పిరిట్ తయారు చేసే పరిశోధనలు చేయించాలని ఆయ‌న చెప్పారు.

దాని వ‌ల్ల లాభాలు చేకూరుతాయ‌ని వివ‌రించారు. ఆ పరిశోధనలు ఫలిస్తే జిల్లాకొక స్పిరిట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. దీంతో ధాన్యాన్ని పండించిన రైతులు న‌ష్ట‌పోకుండా ఉంటార‌ని, ఏ సమస్యలూ ఉండ‌బోవ‌ని తెలిపారు. ఎల్ల‌ప్పుడూ నీరు ఉండే పొలాల్లో వరి త‌ప్ప ఇత‌ర‌ పంటలు వేయ‌డం కష్టమని ఆయ‌న చెప్పారు.
Mudragada Padmanabham
KCR
Jagan

More Telugu News