New Delhi: ఢిల్లీలో గాలి మళ్లీ విషం.. 400కుపైనే ఏక్యూఐ!

Delhi Air Quality At Very Poor Status
  • నోయిడాలో 479గా నమోదు
  • వివేక్ విహార్ లో 471.. ఆనంద్ విహార్ లో 451
  • మిగతా చోట్ల 312గా నమోదు
ఢిల్లీలో గాలి మళ్లీ విషమైంది. కాలుష్యం ‘తీవ్రస్థాయి’కి చేరింది. ఇవాళ ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ)లో గాలి నాణ్యత అత్యంత హీనస్థాయికి పడింది. ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో ఏక్యూఐ 400 (సివియర్)కుపైగా నమోదైంది. మిగతా చోట్ల 312గా రికార్డయింది.

నోయిడాలో 479, వివేక్ విహార్ ప్రాంతంలో 471, ఆనంద్ విహార్ లో 451గా ఏక్యూఐ రికార్డయింది. లోధి రోడ్డులో 339గా నమోదైంది. గాలుల వేగం అత్యంత తక్కువగా ఉండడంతో కాలుష్య కారకాలన్నీ గాలిలో చేరాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే రాబోయే రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని, దాని వల్ల గాలి శుభ్రమవుతుందని అన్నారు.
New Delhi
Air Pollution
AQI

More Telugu News