'ఆచార్య'లో చరణ్ కనిపించేది ఎంతసేపో తెలుసా?

02-12-2021 Thu 11:15
  • నాకు నచ్చిన పాత్ర 'సిద్ధ'
  • సెకండాఫ్ లో ఎంట్రీ ఇస్తాను
  • నా పాత్ర నిడివి 40 నిమిషాలు
  • నాన్నతో చేయాలంటే భయమేసిందన్న చరణ్    
Acharya movie update
చిరంజీవి ఇంతకు ముందు చేసిన ఒకటి రెండు సినిమాల్లో చరణ్ గెస్టుగా మెరిశాడు. 'ఆచార్య' సినిమాలో చరణ్  సిద్ధ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర చాలా పవర్ఫుల్ అంటున్నారు. అలాంటి పాత్ర తెరపై ఎంతసేపు కనిపిస్తుందనే కుతూహలం అభిమానుల్లో ఉంది. ఈ విషయంలోనే తాజా ఇంటర్వ్యూలో చరణ్ క్లారిటీ ఇచ్చాడు.

"ఈ సినిమాలో నేను సిద్ధ పాత్రలో కనిపిస్తాను. ఆచార్య ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లే ఆవేశపూరితుడైన ఒక యువకుడిగా నా పాత్ర ఉంటుంది. ఫస్టాఫ్ లో ఎక్కడా నా పాత్ర కనిపించదు .. సెకండాఫ్ లో మాత్రమే ఎంట్రీ ఇస్తాను. నా పాత్ర నిడివి 40 నిమిషాలు ఉంటుంది. అయితే సెకండాఫ్ అంతా ఉన్నట్టుగానే అనిపిస్తుంది.

ముందుగా నా పాత్ర నిడివి తక్కువగానే ఉండేది. ఆ తరువాత ఆ పాత్ర తాలూకు ప్రాధాన్యత పెరుగుతూ పోయింది. కొరటాల నా పాత్రను మలిచిన తీరు గొప్పగా అనిపించింది. నాన్నతో కలిసి ఇంతకు ముందు జస్ట్ తెరపై మెరిశాను అంతే. కాస్త నిడివిగల ఈ పాత్రలో ఆయన ముందు నటించాలంటే భయమేసింది" అని చెప్పుకొచ్చాడు.