దగ్గరలోనే 'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్ రిలీజ్ డేట్!

02-12-2021 Thu 10:47
  • రాజమౌళి నుంచి 'ఆర్ ఆర్ ఆర్'
  • ప్రధానమైన పాత్రల్లో ఎన్టీఆర్ - చరణ్
  • ఆసక్తిని పెంచుతున్న లిరికల్ సాంగ్స్
  • జనవరి 7వ తేదీన విడుదల    
RRR movie update
రాజమౌళి నుంచి పాన్ ఇండియా సినిమాగా 'ఆర్ ఆర్ ఆర్' రానుంది. జనవరి 7వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ సినిమా నుంచి ఈ నెల 3వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ సిరివెన్నెల అస్తమయం కారణంగా .. ఆయన గౌరవార్థం వాయిదా వేశారు. కొత్త డేట్ ఎప్పుడనేది త్వరలో చెబుతామని అన్నారు. అయితే ఈ నెల 7వ తేదీనగానీ .. 9వ తేదీనగాని ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఒక టాక్ వినిపిస్తోంది. ఈ రెండు తేదీలలో ఒకటి అనుకుని, అప్పుడు అధికారిక పోస్టర్ వదులుతారట.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన సింగిల్స్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ పరంగా ఇవి కొత్త రికార్డులను సెట్ చేస్తూ దూసుకెళుతున్నాయి. ఇక త్వరలో వదలనున్న ట్రైలర్ .. ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేదిలా ఉంటుందని అంటున్నారు. ఈ ట్రైలర్ లో రాజమౌళి ఏయే అంశాలను కవర్ చేశాడనేది చూడాలి.