'భవదీయుడు భగత్ సింగ్' కోసం లొకేషన్స్ వేట!

02-12-2021 Thu 10:27
  • సంక్రాంతికి 'భీమ్లా నాయక్'
  • తదుపరి షెడ్యూల్ కి 'వీరమల్లు'
  • నెక్స్ట్ ప్రాజెక్ట్ హరీశ్ శంకర్ తో
  • మరో రెండు నెలల్లో సెట్స్ పైకి  
Bhavadeeyudu Bhagath Singh movie update
పవన్ కల్యాణ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'భీమ్లా నాయక్' సిద్ధమవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ దిశగానే చకచకా పనులు జరుగుతున్నాయి. అంచనాలు పెంచేలానే అప్ డేట్ లు వస్తున్నాయి.

ఇక ఆల్రెడీ 50 శాతం షూటింగును పూర్తిచేసిన 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగు మళ్లీ మొదలవుతోంది. అందుకు అవసరమైన లొకేషన్స్ .. భారీ సెట్టింగులు రెడీ అవుతున్నాయి. కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు గనుక. ముందుగా అవుట్ డోర్ పనులు పూర్తి చేయాలనే ఆలోచనలో క్రిష్ ఉన్నాడు.

ఈ సినిమా తరువాత హరీశ్  శంకర్ దర్శకత్వంలో పవన్ 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేయనున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు పోస్టర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం హరీశ్ శంకర్ లొకేషన్స్ సెర్చ్ చేస్తూ .. ఫైనల్ చేస్తూ వెళుతున్నాడట. మరో రెండు నెలల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లొచ్చని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించే ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే అలరించనుంది.