సర్జరీ చేయించుకోనున్న మహేశ్ బాబు?

02-12-2021 Thu 10:06
  • 'సర్కారు వారి పాట' షూటింగులో మహేశ్ కాలికి గాయం
  • ముందు నుంచి మోకాలి నొప్పితో బాధపడుతున్న మహేశ్
  • గాయం కారణంగా తీవ్రతరమైన నొప్పి
Mahesh Babu to undergo knee surgery
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సర్జరీ చేయించుకోబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రస్తుతం మహేశ్ 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. షూటింగ్ సమయంలో ఆయన మోకాలికి చిన్న గాయమైంది. ఈ గాయం కారణంగా ఆయన కొన్నాళ్లుగా నొప్పితో బాధపడుతున్నారు. దీంతో మోకాలికి మైనర్ సర్జరీ చేయించుకోవాలని మహేశ్ భావిస్తున్నట్టు చెపుతున్నారు. సర్జరీ జరిగితే ఆయన రెండు, మూడు నెలల పాటు షూటింగ్ కు దూరం కావాల్సి ఉంటుంది. ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.

వాస్తవానికి మహేశ్ బాబుకు దాదాపు ఏడేళ్ల నుంచి మోకాలికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ రెస్ట్ లేకుండా వరుసగా షూటింగుల్లో పాల్గొంటున్నారు. 2020లో సర్జరీ చేయించుకోవాలని అనుకున్నా కరోనా మహమ్మారి నేపథ్యంలో అది కుదరలేదు. ఇప్పుడు షూటింగ్ లో గాయం కూడా కావడంతో నొప్పి మళ్లీ తీవ్రతరమయిందట. దీంతో సర్జరీ చేయించుకోవాలనే నిర్ణయానికి మహేశ్ వచ్చినట్టు చెపుతున్నారు.