బయటపడుతున్న శిల్పా చౌదరి లీలలు.. రూ. 2 కోట్లు మోసపోయిన నటుడు మహేశ్‌బాబు సోదరి ప్రియదర్శిని

02-12-2021 Thu 08:23
  • ప్రియదర్శిని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు
  • దివానోస్ పేరుతో పేకాట క్లబ్
  • 90 మంది వరకు సెలబిట్రీల మహిళలు
  • పోలీసులను ఆశ్రయిస్తున్న మరింతమంది బాధితులు
Shilpa Choudary cheating tollywood actor maheshbabus sister
పలువురు సెలబ్రిటీలను మోసం చేసి కోట్లు దండుకున్న శిల్పా చౌదరి లీలలు రోజుకొకటి చొప్పున వెలుగుచూస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని నుంచి రూ. 2 కోట్లకు పైగా నగదు తీసుకుని మోసం చేసినట్టు తాజాగా బయటపడింది. ప్రియదర్శిని ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గండిపేటలోని సిగ్నేచర్ విల్లాలో పదేళ్లుగా నివసిస్తున్న శిల్పా చౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు ధనవంతులుగా చెలామణి అయ్యేవారు. టీవీ, సినీ నిర్మాతగా పరిచయం చేసుకున్న శిల్పా సినీ ప్రముఖుల కుటుంబాల్లోని మహిళలను తరచూ కలుసుకుంటూ వీకెండ్ పార్టీలకు ఆహ్వానించారు. తొలుత కొందరితోనే ఈ కిట్టీ పార్టీ మొదలు కాగా, ఆ తర్వాత ఆ ఆ పార్టీలను దివానోస్ పేరుతో పేకాట క్లబ్‌గా మార్చేశారు.

ఇందులో 90 మంది వరకు సెలబ్రిటీ కుటుంబాల మహిళలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో అరెస్ట్ అయిన శిల్ప ప్రస్తుతం జైల్లో ఉన్నారు. విషయం తెలిసిన బాధితులు మరింతమంది తాము కూడా ఆమె చేతిలో మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.