ఏపీలో వరద బాధితులకు చిరంజీవి, మహేశ్ బాబు విరాళం

01-12-2021 Wed 19:00
  • కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను కుదిపేసిన వరదలు
  • కడప జిల్లాలో బీభత్సం
  • ఇప్పటికే విరాళం ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్
  • అదే బాటలో చిరంజీవి, మహేశ్ బాబు
  • చెరో రూ.25 లక్షల విరాళం
Chiranjeevi and Mahesh Babu contributes to help flood affected families in AP
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంభవించిన వరదల ప్రభావం అంతాఇంతా కాదు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను ముంచెత్తిన భారీ వర్షాలు తీవ్రస్థాయిలో వరదలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు ఏపీలో వరద బాధితుల సహాయార్థం విరాళాలు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే రూ.25 లక్షల విరాళం ప్రకటించగా, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా అదే బాటలో నటించారు.

ఏపీ వరద బాధితుల సహాయ చర్యల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ చర్యల నిధికి చెరో రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. భారీ వర్షాలు సృష్టించిన వరద బీభత్సం తనను ఎంతగానో కలచివేసిందని చిరంజీవి ట్విట్టర్ లో తెలిపారు. మహేశ్ బాబు స్పందిస్తూ, వరద బాధిత ప్రజల పట్ల ప్రతి ఒక్కరూ ఉదారంగా సాయపడాలని పిలుపునిచ్చారు.