రీమేక్ దిశగా అజిత్ 'వాలి'

01-12-2021 Wed 18:41
  • 1999లో అజిత్ హీరోగా వచ్చిన 'వాలి'
  • అజిత్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమా
  • రీమేక్ ఆలోచన చేసిన బోనీ కపూర్ 
  • త్వరలోనే సన్నాహాలు  
Boney Kapoor is duing remake of Vaalee
అజిత్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'వాలి' ఒకటిగా కనిపిస్తుంది.1999లో వచ్చిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను రాబట్టింది. అజిత్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, సిమ్రాన్ .. జ్యోతిక కథానాయికలుగా అలరించారు. ఈ సినిమాతోనే ఎస్.జె. సూర్య దర్శకుడిగా పరిచయమయ్యాడు.

ఈ సినిమాకి దేవ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన సంగీతం ఈ సినిమా విజయవంతం కావడంలో ముఖ్యమైన పాత్రను పోషించింది. కథాకథనాల పరంగానే కాకుండా, ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గాను నిలబెట్టింది. అలాంటి ఈ సినిమాను మళ్లీ ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన తెలుగు .. తమిళ .. మలయాళం రీమేక్ హక్కులను బోనీ కపూర్ సొంతం చేసుకున్నారు. కన్నడ .. హిందీ భాషలకి సంబంధించిన రీమేక్ హక్కుల విషయంలో ఏవో సమస్యలు ఉన్నాయట. వాటిని కూడా చక్కబెట్టే పనిలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.