ఏపీలో కొత్తగా 184 కరోనా కేసుల నమోదు

01-12-2021 Wed 18:06
  • 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 183 మంది
  • రాష్ట్ర వ్యాప్తంగా ఒకరు మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,149
AP records 184 corona new cases
ఏపీలో కరోనా కేసుల నమోదు నిలకడగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 29,595 శాంపిల్స్ ని పరీక్షించగా 184 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 183 మంది కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 39 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20,73,093 కేసులు నమోదు కాగా... 20,56,501 మంది కోలుకున్నారు. మొత్తం 14,443 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,149 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.