ఏపీలో వరద బాధితులకు రూ.25 లక్షల విరాళం ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్

01-12-2021 Wed 17:23
  • ఏపీలో వరద బీభత్సం
  • ముఖ్యంగా కడప జిల్లాలో జలవిలయం
  • 40 మందికి పైగా మృతి
  • కలచివేసిందన్న ఎన్టీఆర్
Jr NTR donates towards flood affected people in AP
ఏపీలో ఇటీవల వరదలు బీభత్సం సృష్టించగా, ఒక్క కడప జిల్లాలోనే 40 మందికి పైగా జలవిలయానికి బలయ్యారు. తీవ్రస్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. వేలాదిగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్లు కోల్పోయి దీనస్థితిలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఏపీలో వరద బాధితులకు రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.

రాష్ట్రంలో వరద బాధితుల కడగండ్లు చూశాక కలచివేసిందని తెలిపారు. అందుకే వారికి సాయంగా తన వంతుగా కొద్దిమొత్తం విరాళంగా ఇస్తున్నానని పేర్కొన్నారు.