ఆర్టీసీ ఆస్తులను టీఆర్ఎస్ నేతలకు కట్టబెట్టే ప్రయత్నం: రేవంత్ రెడ్డి

01-12-2021 Wed 16:53
  • పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు
  • వారం రోజుల్లో నిర్ణయం తీసుకోనున్న సీఎం
  • ఛార్జీలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్న రేవంత్
Revanth Reddy comments on increasing of RTC charges
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్ధమైంది. పల్లె వెలుగు బస్సుకు కిలోమీటర్ కు 25 పైసలు, ఎక్స్ ప్రెస్ లు, డీలక్స్ లకు 30 పైసలు పెంచాలని ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనలు పంపింది. వారం రోజుల్లోగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నారు.

మరోవైపు ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీడీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ ఆస్తులను టీఆర్ఎస్ నేతలకు కట్టబెట్టేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను పట్టించుకోకుండా... నష్టాల పేరుతో పేదవాడి జేబుకు చిల్లు పెడుతూ ఆర్టీసీ ఛార్జీలను పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు.