మహాప్రస్థానంలో ముగిసిన 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి అంత్యక్రియలు

01-12-2021 Wed 16:43
  • జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
  • ఆచారం ప్రకారం అంత్యక్రియలు
  • కన్నీటిపర్యంతమైన అభిమానులు, సన్నిహితులు
  • కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం
Sirivennela last rites concludes in Mahaprasthanam cemetry
లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కడసారి వీడ్కోలు నడుమ హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశానవాటికలో సిరివెన్నెల అంత్యక్రియలు ముగిశాయి. ఆచార సంప్రదాయాల ప్రకారం ఆయన భౌతికకాయాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, ఆయనతో సాన్నిహిత్యం ఉన్న వారి వేదన వర్ణనాతీతం.

న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల... కొంతకాలం కిందట లంగ్ క్యాన్సర్ బారినపడ్డారు. చికిత్స చేసినప్పటికీ మరో ఊపిరితిత్తికి క్యాన్సర్ వ్యాపించింది. దానికితోడు ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఇటీవల అనారోగ్యం తిరగబెట్టడంతో ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కానీ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.