కడప జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ పర్యటన

01-12-2021 Wed 16:04
  • కడప జిల్లాలో వరదలు
  • తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం
  • సీఎం రాక నేపథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు
  • ఎన్నార్ పల్లి నవోదయ విద్యాలయం వద్ద హెలిప్యాడ్
CM Jagan will tour in Kadapa district
భారీ వర్షాలు, వరదలతో కుదేలైన కడప జిల్లాలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు. డిసెంబరు 2న రాజంపేట వరద బాధిత ప్రాంతాలకు సీఎం వస్తుండడంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంత గ్రామాలు పులపుత్తూరు, మందపల్లితో పాటు అన్నమయ్య డ్యామ్ ప్రాంతంలోనూ సీఎం జగన్ పర్యటన సాగనుంది.

సీఎం రాక నేపథ్యంలో ఎన్నార్ పల్లిలోని జవహర్ నవోదయ విద్యాలయం సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తుండడంతో కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ ఎం.గౌతమి, సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.