ఇక నుంచి నన్ను 'తాలా' అని పిలవొద్దు: హీరో అజిత్ స్పష్టీకరణ

01-12-2021 Wed 15:40
  • చాలాకాలంగా అజిత్ కు 'తాలా' అనే బిరుదు
  • 'తాలా' అంటే తమిళంలో నాయకుడు అని అర్థం
  • తాజాగా ఓ ప్రకటన విడుదల చేసిన అజిత్
  • తన పేరుకు ముందు ఎలాంటి బిరుదులు వద్దని వెల్లడి
Hero Ajith appeals do not write Thala prefix before his name
తమిళ స్టార్ హీరో అజిత్ ను అభిమానులు, మీడియా 'తాలా' అని సంబోధిస్తుండడం తెలిసిందే. తమిళంలో 'తాలా' అంటే నాయకుడు అని అర్థం. అయితే ఇక నుంచి తనను ఎవరూ 'తాలా' అని, మరే ఇతర బిరుదులతో కానీ పిలవొద్దని అజిత్ స్పష్టం చేశారు. తన పేరుకు ముందు 'తాలా' అనే బిరుదును ఇకమీదట రాయొద్దని తెలిపారు. ఈ మేరకు అజిత్ ఓ ప్రకటన విడుదల చేశారు.

తన గురించి రాయాల్సి వస్తే అజిత్, అజిత్ కుమార్ అనో, లేక 'ఏకే' అని మాత్రమే రాయాలని ఆ ప్రకటనలో వివరించారు. ఆయన ఏ కారణంతో ఈ సూచన చేశారన్నది ప్రకటనలో వెల్లడించలేదు. ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, విజయం, ప్రశాంతతతో కూడిన జీవితం ప్రతి ఒక్కరికీ దక్కాలని ఆకాంక్షిస్తున్నట్టు అజిత్ తన ప్రకటనలో పేర్కొన్నారు.