టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం కుటుంబంలో తీవ్ర విషాదం

01-12-2021 Wed 14:43
  • కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • కిరణ్ సోదరుడు రామానుజులు రెడ్డి దుర్మరణం
  • చెన్నూరు వద్ద ఘటన
  • టాలీవుడ్ లో వరుస విషాదాలు
Young hero Kiran Abbavaram lost his brother in a road accident
టాలీవుడ్ మరోసారి దిగ్భ్రాంతికి గురైంది. యువ హీరో కిరణ్ అబ్బవరం కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కిరణ్ సోదరుడు రామానుజులు రెడ్డి కన్నుమూశాడు. ఇవాళ కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రామానుజులు రెడ్డి దుర్మరణం పాలయ్యాడు. చెన్నూరు వద్ద ఈ ఘటన జరిగింది.

'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కల్యాణమండపం' వంటి చిత్రాలతో కిరణ్ అబ్బవరం నటుడిగా గుర్తింపు అందుకున్నాడు. కెరీర్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరుణంలో సోదరుడి మరణం కిరణ్ ను తీవ్ర విషాదానికి గురిచేసింది.

కొన్నిరోజుల వ్యవధిలోనే వరుస మరణాలు టాలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారినపడి మరణించగా, ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు.