'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్ రిలీజ్ వాయిదా!

01-12-2021 Wed 10:59
  • జనవరి 7వ తేదీన 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్
  • అప్ డేట్స్ పరంగా పెరిగిన స్పీడ్
  • ఈ నెల 3న రావలసిన ట్రైలర్
  • వాయిదా వేసినట్టు  ప్రకటించిన మేకర్స్
RRR movie update
ఇప్పుడు ఇటు మెగా అభిమానులు .. అటు నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. జనవరి 7వ తేదీన ఈ సినిమాను వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు.

అందులో భాగంగానే ఈ సినిమా నుంచి ఒక్కో లిరికల్ సాంగ్ ను వదులుతూ వస్తున్నారు. ఈ నెల 3వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు రీసెంట్ గా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయడం లేదు. ఈ ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేశామనీ, తిరిగి ఎప్పుడు విడుదల చేసేది త్వరలో తెలియజేస్తామని మేకర్స్ ప్రకటించారు.

సిరివెన్నెల అకాల మరణంతో ఇండస్ట్రీ అంతా కూడా దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఆయన అభిమానులంతా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. తన పాటలతో ఆయన కోట్లాది హృదయాలను దోచుకున్నారు. వాళ్లంతా కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. అందువల్లనే ఆయన గౌరవార్థం ఈ ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేశారని అనుకోవచ్చు.