తెలుగు సినిమా పాటలు ఎలా ఉండబోతున్నాయో ఆలోచించడానికే కష్టంగా ఉంది: మహేశ్ బాబు

01-12-2021 Wed 10:38
  • సిరివెన్నెలకు నివాళి అర్పించిన మహేశ్ బాబు
  • తెలుగు సినీ పరిశ్రమకు సిరివెన్నెల పర్యాయపదమన్న మహేశ్
  • ఒక గొప్ప టాలెంటెడ్ వ్యక్తిని కోల్పోయామని ఆవేదన
Its hard to imagine Telugu songs without Sirivennela says Mahesh Babu
సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి మహేశ్ బాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిరివెన్నెల గారు లేకుండా తెలుగు సినిమా పాటలు ఎలా ఉండబోతున్నాయో ఆలోచించడానికే చాలా కష్టంగా ఉందని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయనను పర్యాయపదంగా చెప్పుకోవచ్చని వ్యాఖ్యానించారు.

సాహిత్య, సంగీత విభాగానికి ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఒక గొప్ప టాలెంటెడ్ వ్యక్తిని కోల్పోయామని తెలిపారు. శాస్త్రిగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. మరోవైపు సిరివెన్నెలను కడసారి చూసుకోవడానికి వందల సంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నారు. బరువెక్కిన హృదయాలతో నివాళి అర్పిస్తున్నారు.