'భీమ్లా నాయక్' ఫోర్త్ సింగిల్ రిలీజ్ వాయిదా!

01-12-2021 Wed 10:30
  • పవన్ నుంచి 'భీమ్లా నాయక్'
  • ఈ రోజున రావలసిన ఫోర్త్ సింగిల్
  • సిరివెన్నెల మరణంతో వాయిదా
  • అధికారికంగా చెప్పిన మేకర్స్  
Bheemla Nayak movie update
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 'భీమ్లా నాయక్' సినిమా రూపొందుతోంది. రానా మరో ప్రధానమైన పాత్రను పోషించాడు. ఈ రెండు పాత్రల చుట్టూనే కథ తిరుగుతుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఇంతవరకూ వదిలిన మూడు సింగిల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

నాల్గొవ సింగిల్ ను వదలడానికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నారు. డిసెంబర్ 1వ తేదీన ఉదయం 10:08 నిమిషాలకు ఈ సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఫోర్త్ సింగిల్ రిలీజ్ ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమయంతో, అభిమానులంతా ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఇండస్ట్రీలోని వాళ్లంతా కూడా ఆయనతో తమకి గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రునివాళులు అర్పిస్తున్నారు. అందువల్లనే సిరివెన్నెల గౌరవార్థం ఫోర్త్ సింగిల్ రిలీజ్ ను వాయిదా వేశారు.