ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ అగర్వాల్ కు కళ్లు చెదిరే జీతం!

01-12-2021 Wed 09:41
  • ఏడాదికి 1 మిలియన్ డాలర్ల వేతనం
  • రూ. 94 కోట్ల విలువైన కంపెనీ షేర్లు
  • 2011లో ట్విట్టర్లో చేరిన పరాగ్ అగర్వాల్
Salary details of Twitter CEO Parag Agarwal
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులైన సంగతి తెలిసిందే. జాక్ డోర్సే సీఈవో పదవికి రాజీనామా చేయడంతో... పరాగ్ అగర్వాల్ ఆ బాధ్యతలను అందుకున్నారు. పరాగ్ జీతానికి సంబంధించిన వివరాలను యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు ట్విట్టర్ తెలిపింది.

ఏడాదికి 1 మిలియన్ డాలర్ల (రూ. 7.5 కోట్లకు పైగా) వేతనాన్ని ఆయన పొందుతారని చెప్పింది. దీంతో పాటు 1.25 మిలియన్ డాలర్ల (రూ. 94 కోట్లు) విలువైన షేర్లను కూడా ఆయన పొందుతారని తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి పరాగ్ అగర్వాల్ కు షేర్లు అందుతాయని చెప్పింది. పరాగ్ అగర్వాల్ ముంబై ఐఐటీలో చదివారు. అనంతరం మైక్రోసాఫ్ట్, యాహూ, ఎల్ అండ్ టీ ల్యాబ్స్ లో పని చేశారు. 2011లో ఆయన ట్విట్టర్ లో చేరారు. 2017లో ఆ సంస్థ సీటీవోగా బాధ్యతలను నిర్వహించారు.