JAI BHIM: ‘జై భీమ్’ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్

  • విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ‘జై భీమ్’
  • ఉత్తమ విదేశీ చిత్రంగా నామినేట్
  • మరో తమిళ సినిమా కూషంగల్ కూడా నామినేట్
  • గుడ్ న్యూస్‌ను పంచుకున్న ‘జై భీమ్’ టీం
SURIYAS JAI BHIM ENTERS GOLDEN GLOBE 2022

కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. నిజ జీవితంలో జరిగిన గిరిజన యువకుడి లాకప్ డెత్ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు అంతర్జాతీయంగానూ అరుదైన గుర్తింపు లభించింది.

ఆస్కార్ అవార్డు తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ‘జై భీమ్’ నామినేట్ అయింది. ఈ విషయాన్ని జై భీమ్ సినిమా యూనిట్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేసింది.  వచ్చే ఏడాది జనవరిలో లాస్‌ఏంజెలెస్ వేదికగా గోల్డెన్ గ్లోబ్-2022 అవార్డుల వేడుక జరగనుంది.

జై భీమ్‌తోపాటు పీఎస్ వినూత్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ డ్రామా మూవీ ‘కూషంగళ్’ (పెబ్బెల్స్) కూడా గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఇంగ్లిషేతర అత్యుత్తమ సినిమా కేటగిరీలో నామినేట్ అయింది. ఈ రెండింటిలో ఏ ఒక్కటి తుది జాబితాలో చోటు దక్కించుకున్నా భారతీయ సినిమాకు అరుదైన గౌరవం లభించినట్టే.

More Telugu News