Sirivennela: రేపు ఉదయం 7 గంటలకు ఫిలిం ఛాంబర్ కు సిరివెన్నెల పార్థివదేహం.. మహాప్రస్థానంలో అంత్యక్రియలు!

Sirivennela body to shift to Film Chamber tomorrow
  • కిమ్స్ ఆసుపత్రిలోనే సిరివెన్నెల మృతదేహం
  • రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం ఫిలింఛాంబర్ కు తరలింపు
  • ఏపీ ప్రభుత్వం తరపున హాజరుకానున్న మంత్రి పేర్ని నాని
తెలుగు సినీ పరిశ్రమకు దశాబ్దాల పాటు సేవలందించిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆకస్మిక మరణం అందరినీ కలచి వేస్తోంది. ప్రస్తుతం ఆయన భౌతికకాయం ఇంకా హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలోనే ఉంది. ఈ రాత్రికి అక్కడే ఉంటుంది.

రేపు ఉదయం 7 గంటలకు పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఫిలింఛాంబర్ కు తరలిస్తారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని అంత్యక్రియలకు హాజరుకానున్నారు.
Sirivennela
Film Chamber
Last Rights

More Telugu News