తెలంగాణలో మరో 196 మందికి కరోనా నిర్ధారణ

30-11-2021 Tue 20:11
  • గత 24 గంటల్లో 38,615 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 78 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 3,591 మందికి చికిత్స 
Corona diagnosis for another 196 people in Telangana
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,615 కరోనా పరీక్షలు నిర్వహించగా, 196 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 78 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 20, రంగారెడ్డి జిల్లాలో 15, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9, కరీంనగర్ జిల్లాలో 8 కేసులు గుర్తించారు. ఆదిలాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, వనపర్తి, వరంగల్ రూరల్ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 184 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,75,994 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,68,411 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,591 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,992కి పెరిగింది.