'పుష్ప' స్పెషల్ సాంగ్ నుంచి సమంత స్టిల్!

30-11-2021 Tue 18:54
  • షూటింగు దశలో 'పుష్ప'
  • చిత్రీకరణ దశలో స్పెషల్ సాంగ్
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
  • డిసెంబర్ 17వ తేదీన విడుదల
Pushpa movie update
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథానాయికగా రష్మిక కనువిందు చేయనుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగాన్ని డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు.

ఆ తరువాతనే స్పెషల్ సాంగ్ సమంత చేయనుందనే విషయం తెరపైకి వచ్చింది. ఆ వెంటనే ఆ విషయం స్పష్టమైంది. సుకుమార్ ఇంతకు ముందు చేసిన 'రంగస్థలం'లో హీరోయిన్ గా చేసిన సమంత, ఆయన తరువాత సినిమాకి స్పెషల్ సాంగ్ చేయడానికి సిద్ధపడటం ఆశ్చర్యకరం. రీసెంట్ గా బన్నీ .. సమంతలపై స్పెషల్ సాంగ్ షూటింగు మొదలైందనే వార్త బయటికి వచ్చింది.

ప్రత్యేకంగా వేసిన సెట్లో ఆ పాటకి సంబంధించిన చిత్రీకరణ జరుగుతూ ఉండగానే, అందుకు సంబంధించిన సమంత స్టిల్ కూడా బయటికి వచ్చింది. ఇక ఈ పాట లిరికల్ వీడియోను త్వరలో వదలనున్నారు. ఫస్టు పార్టులోనే ఈ పాటను వదులుతుండటం అభిమానులను ఖుషీ చేసే విషయం.