'బంగార్రాజు' ఆ డేట్ ను ఖాయం చేసుకున్నాడట!

30-11-2021 Tue 17:31
  • 'బంగార్రాజు'గా నాగార్జున
  • పిల్ల బంగార్రాజుగా చైతూ
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • సంక్రాంతి బరిలోకి దిగే ఛాన్స్
Bangarraju Movie Update
నాగార్జున కథానాయకుడిగా 'బంగార్రాజు' సినిమా రూపొందుతోంది. ఆయన సరసన నాయికగా రమ్యకృష్ణ అలరించనుంది. ఈ సినిమాలో యువ జంటగా నాగచైతన్య - కృతి శెట్టి కనువిందు చేయనున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు జరుపుకుంటోంది.

అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. గ్రామీణ నేపథ్యంలోని కథ కావడం వలన, పండుగ సీజన్ కలిసి వస్తుందని భావించారు. కానీ అప్పటికి అన్ని పనులు అవుతాయో లేదోననే ఉద్దేశంతో ఖరారు చేయలేకపోయారు.

కానీ అదే రోజున ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి ఆల్రెడీ నాగార్జున వచ్చేశారని అంటున్నారు. ఆ దిశగానే చాలా వేగంగా పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' .. 'భీమ్లా నాయక్' .. 'రాధేశ్యామ్' సినిమాలతో గట్టిపోటీ ఉన్నప్పటికి, కంటెంట్ పై ఉన్న నమ్మకంతో నాగార్జున బరిలోకి దిగుతున్నారని చెప్పుకుంటున్నారు.