సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత.. శోకసంద్రంలో టాలీవుడ్!

30-11-2021 Tue 16:40
  • గత కొంత కాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల
  • హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • ఈ సాయంత్రం 4.07 గంటలకు కన్నుమూత
Sirivennala Seetharama Sastri passes away
ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా న్యుమోనియాతో ఆయన బాధ పడుతున్నారు. ఈనెల 24న హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు నిపుణులైన వైద్య బృందం చికిత్సను అందించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ సాయంత్రం 4.07 గంటలకు ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

ఆయన మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ప్రార్థించిన అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. కవిగా, సినీ పాటల రచయితగా, నటుడిగా ఆయన తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.