దేశంలో ఒక్క ఒమిక్రాన్ కేసూ లేదు: కేంద్ర ఆరోగ్య మంత్రి

30-11-2021 Tue 14:01
  • రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సమాధానం
  • దాని నివారణ, కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి
  • జన్యు పరిక్రమాన్ని విశ్లేషిస్తున్నామని కామెంట్
There Is No Omicron Case For Now Says Mansukh Mandaviya
దేశంలో ఇప్పటిదాకా ఒక్క ‘ఒమిక్రాన్’ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఇవాళ రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఈ కరోనా కొత్త వేరియంట్ 14 దేశాలకు వ్యాపించిందని చెప్పిన ఆయన.. ప్రస్తుతానికైతే మన దేశంలో లేదని తెలిపారు. అది రాకుండా నివారించేందుకు, వచ్చినా కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు.

వేరియంట్ కు సంబంధించిన జన్యు పరిక్రమాన్ని విశ్లేషిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా నియంత్రణలోనే ఉందని, అయితే అది మాత్రం ఇంకా పోలేదని తెలిపారు. ఇప్పటిదాకా 124 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను వేశామన్నారు. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ చాలా డేంజరంటూ నిన్న డబ్ల్యూహెచ్ వో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచానికి పెను ముప్పు తప్పదని, మరిన్ని వేవ్ లు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.