ఉరికొయ్యకు వేలాడే రైతుల శవాలు కనిపించట్లేదా?: సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్

30-11-2021 Tue 13:50
  • అనాథలైన వారి కుటుంబాల ఆర్తనాదాలు వినిపించట్లేదా?
  • అధికారపు పొరలు కమ్మి చూపు మందగించిందా?
  • రైతులు కోటీశ్వరులయ్యారంటూ బుద్ధిలేని మాటలా?
Revanth Reddy Fires On CM KCR
తెలంగాణలో రైతులు కోటీశ్వరులయ్యారన్న సీఎం కేసీఆర్ మాటలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇలాంటి బుద్ధిలేని మాటలు మాట్లాడే కేసీఆర్ కు.. ఉరికొయ్యకు వేలాడే రైతుల శవాలు కనిపించట్లేదా? అని నిలదీశారు. అనాథలైన వారి కుటుంబాల ఆర్తనాదాలు వినిపించట్లేదా? అని ప్రశ్నించారు. అధికారపు పొరలు కమ్మి కేసీఆర్ చూపు మందగించిందా? అని మండిపడ్డారు.

అప్పుల బాధతో నిన్న ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతుల విషయాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేసి రాష్ట్ర సర్కార్ ను నిలదీశారు. నిన్న ప్రెస్ మీట్ సందర్భంగా రైతులు కోటీశ్వరులయ్యారంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.